FbTelugu

చంద్రబాబుతో ఏపీకి తీవ్ర నష్టం: ఎమ్మెల్యే బలరాం

ప్రకాశం: చంద్రబాబు నాయుడు కారణంగా ఏపీ చాలా నష్టపోయిందని టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఆరోపించారు.

ప్రాజెక్టులపై గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యం చేశారని, ఆ పాపం భవిష్యత్తు తరాలపై పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేరు. వైసీపీ ఏడాది పాలనపై చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నా… ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఓటమిపై టీడీపీ ఇప్పటికైనా సమీక్షించుకోవాలని ఆయన హితవు పలికారు.

ప్రస్తుత రాజకీయాల్లో విలువలు ఏమాత్రం లేవని, డబ్బులతో రాజకీయాలు నడుపుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టు నిర్లక్ష్యం చేసిందని, జగన్ వచ్చిన తరువాత పనులు వేగంగా జరుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.