FbTelugu

కేంద్ర మంత్రి నిర్మల… కాలనాగు: ఎంపీ తీవ్ర విమర్శలు

కొలకత్తా: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను తృణముల్ కాంగ్రెస్ పార్టీ కాలనాగుతో పోల్చింది. సెరంపూర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పెట్రోల్, డీజీల్ ధరల పెంపుదలను నిరసిస్తూ బంకురా జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో బెనర్జీ నిర్మలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మల పూర్తిగా భ్రష్టుపట్టించారని, కోలుకోని విధంగా సర్వనాశనం చేశారని ఆయన ఆరోపించారు. ఇలాంటి పనికి మాలిన మంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. పాము కాటు వేస్తే మనుషులు చనిపోయినట్లుగానే నిర్మల ఆర్థిక వ్యవహారాలతో ప్రజలు చనిపోతున్నారని బెనర్జీ ఆరోపించారు.

పేద ప్రజలు, మధ్య తరగి ప్రజలు ఉపయోగించే రైళ్లను కూడా బీజేపీ ప్రభుత్వం వదలడం లేదని అన్నారు. వాటిని ప్రైవేటు కంపెనీలకు తాకట్టు పెట్టి వేల కోట్లు దండుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని బెనర్జీ విమర్శించారు.

You might also like