హైదరాబాద్: ఓ యువకుడు తన ప్రేమను నిరాకరించిందని ఓ యువతిని అతి దారుణంగా గొంతుకోసి హతమార్చిన కేసును విచారించిన నాంపల్లిలోని రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సంచలన
తీర్పును ఇచ్చింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న ఆరెపల్లి వెంకట్(25) ను దోషిగా తేల్చి యువకుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. వారాసిగూడకు చెందిన ఆరెపల్లి వెంకట్ 2018 ఆగస్టు 7న ఓ యువతిని బ్లేడుతో గొంతుకోసి హత్య చేశాడు.