FbTelugu

చిన్నారిపై లైంగిక దాడి కేసులో సంచలన తీర్పు

* 2018లో 5ఏండ్ల బాలికపై లైంగిక దాడి
* యువకునికి 20 ఏండ్ల జైలు, జరిమానా

హైదరాబాద్: 5 ఏండ్ల చిన్నారిపై యువకుడు లైంగిక దాడి కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషిగా తేలిన యువకునికి 20 ఏండ్ల జైలు శిక్షతో పాటూ రూ.12 వేల జరిమానాను విధించింది.

వివరాల్లోకెళితే.. 2018 మే 27న ప్రభాకర్(20) అనే యువకుడు ఒంటరిగా ఉన్న ఐదేళ్ల బాలికను బయటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు నిందితున్ని దోషిగా తేలుస్తూ.. 20 ఏండ్ల జైలు శిక్షతో పాటూ రూ.12 వేల జరిమానాను విధించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.