FbTelugu

ముంబై పోలీసులపై సంచలన ఆరోపణలు: బిహార్ డీజీపీ

పాట్నా: బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ ఎఫ్ఐఆర్ పత్రాలను ముంబై పోలీసులు ఇవ్వడం లేదని బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ఆరోపించారు. ఈ కేసులో కీలకమైన సమాచారం సీసీటీవీ ఫుటేజీ, పోస్టుమార్టం రిపోర్టులతో పాటు మిగతా సమాచారాన్ని తమ పోలీసులకు ఇవ్వలేదన్నారు.

బిహార్ పోలీసులు చేపట్టిన విచారణకు ముంబై పోలీసులు ఎంతమాత్రం సహకరించడం లేదన్నారు. సుశాంత్ ఆత్మహత్య ఘటనపై పెద్ద దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ పరిశ్రమను ఈ ఘటన కుదిపేస్తున్నది. తన కుమారుడి మరణంపై దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కోరుతూ సుశాంత్ తండ్రి కెకె.సింగ్ పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కుమరుడి బ్యాంకు ఖాతా నుంచి కోట్లాది రూపాయలు నటి రియా చక్రవర్తి ఖాతాలకు తరలివెళ్లాయని, దీనిపై విచారణ జరపాలని ఆయన పోలీసులను కోరారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

You might also like