FbTelugu

దేశంలోనే సంచలనం… సింహాలకు కరోనా

హైదరాబాద్: నెహ్రూ జులాజికల్ పార్క్ దేశంలోనే సంచలనం సృష్టించింది. తొలిసారిగా 8 సింహాలకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. సింహాల ఆరోగ్యం నిలకడగా ఉందని జూ అధికారులు తెలిపారు.

సఫారీ 40 ఎకారల్లో విస్తరించి ఉండగా ఇందులో పదేళ్లు నిండిన 12 వరకు ఆసియా సింహాలు ఉన్నాయి. ఇటీవల ఆసియా సింహాలకు ఆకలి మందగించడం, ముక్కు నుంచి నీళ్లు కారడం, నలతగా ఉండడాన్ని వన్యప్రాణి వైద్యులు గమనించారు. రెండు మూడురోజులు గమనించిన తరువాత అదే పరిస్థితి ఉండడంతో నమూనాలు సేకరించి సిసిఎంబికి పంపించారు. పరీక్షలు జరిపిన సిసిఎంబి, 8 సింహాలకు పాజిటివ్ సోకిందని రిపోర్టులు ఇవాళ మధ్యాహ్నం జూ అధికారులకు పంపించింది. వీటిలో నాలుగు ఆడ సింహాలు, నాలుగు మగ సింహాలు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.