FbTelugu

పసుపుద‌ళంలో సీనియ‌ర్ల గ‌గ్గోలు!

వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర‌రావు ప‌రిచయం అక్క‌ర్లేదు. పంచెక‌ట్టులో తెలుగు ద‌నానికి కేరాఫ్ చిరునామా. కృష్ణా జిల్లాలో ది మోస్ట్ సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌. రైతు కూడా.

ఎన్టీఆర్ స‌మ‌కాలికుడుగా చెబుతుంటారు. టీడీపీలో మ‌రింత‌గా ఎద‌గాల్సిన ఆయ‌న అక్క‌డే ఆగారు.. రాజ‌కీయాల‌కు దూరంగా జ‌రిగారు. బుచ్చ‌య్య‌చౌద‌రి.. తెలుగుదేశం పార్టీకు క‌ష్టాలు వ‌చ్చిన‌పుడు కూడా వీడ‌ని బ‌ల‌మైన నాయ‌కుడు. ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ఎందుకో అనుకున్నంత‌గా ఎద‌గ‌లేక‌పోయారు. గాలి ముద్దుకృష్ణ‌మ ‌నాయుడు.. చివ‌ర్లో మంత్రి కావాల‌ని చాలా ఉబ‌లాట‌ప‌డ్డారు. క‌ల నెర‌వేర‌కుండానే కాలం చేశారు.

ఇప్ప‌టికీ ఆయ‌న వారసులు ప‌ట్టుకోసం కోట్లాడుకుంటూనే ఉన్నారు. గ‌ల్లా అరుణ‌.. సీనియ‌ర్ నాయ‌కురాలు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వ‌చ్చినా… ఇప్ప‌టికీ ఆమె జాడ ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ఉంటుంది. ఇలా… ఏపీలో తెలుగుదేశం పార్టీలో కార్య‌క‌ర్త‌గా జెండామోసి ఎమ్మెల్యేగా ఎదిగిన సీనియ‌ర్లు చాలా మంది అలాగే ఉన్నారు. ఆత్మాభిమానం చంపుకుని వేరే పార్టీలోకి చేర‌లేక‌.. ప‌సుపు చొక్కా వేసుకుని రాజ‌కీయాలు న‌డుపుతున్నారు. అధినేత చంద్ర‌బాబునాయుడు అవ‌కాశం ఇవ్వ‌క‌పోతాడా! అని ఆశగా చూస్తున్నారు.

2014లో టీడీపీ అనూహ్యంగా బీజేపీ, జ‌న‌సేన‌తో క‌ల‌సి గెల‌వగానే కొత్త నేత‌లు తెర‌మీద‌కు వ‌చ్చారు. రాత్రికి రాత్రే మంత్రులు, ఎంపీలుగా మారిన బ‌డా బాబులున్నారు. ఇవ‌న్నీ జెండామోసిన సీనియ‌ర్ల‌కు అవ‌మానమ‌నే చెప్పాలి. ఐదేళ్ల‌పాటు పార్టీలో ఉన్నా.. సీనియ‌ర్లు.. బాబు అపాయింట్‌మెంట్ దొర‌క‌నంత‌గా వెనుక‌బ‌డ్డారు. ఇప్పుడు వైసీపీ స‌ర్కారు.. రాబోయే ఐదేళ్ల‌లో టీడీపీ బ‌లం పుంజుకుంటుంద‌నే ఆన‌వాళ్లు లేవు. పైగా.. పాత కేసులు, కొత్త ఫిర్యాదుల‌తో పోలీస్ స్టేష‌న్ గుమ్మం చుట్టూ తిరిగే ప‌రిస్థితిలో చాలామంది తెలుగు త‌మ్ముళ్లున్నారు. వ‌య‌సులో ఉన్నారు కాబ‌ట్టి.. స‌రిపోయింది.

వ‌య‌సు మ‌ళ్లిన నేత‌ల‌కు ఇది స‌వాల్‌గా మారింద‌నే చెప్పాలి. అందుకే.. ఈ వేద‌న మా వ‌ల్ల కాదంటూ.. కేసుల‌కు భ‌య‌ప‌డో.. జైలు ఊచ‌లు గుర్తొచ్చో.. జ‌గ‌న్ ఎదుట కండువా మార్చుకున్నారు. మాజీ మంత్రి శిద్దా, ఎమ్మెల్యే క‌ర‌ణం, నేడోరేపో… మ‌రికొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు ఫ్యాన్ కింద‌కు చేర‌బోతున్నారు. ఇటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో సీనియ‌ర్లు మౌనంగా ఉండ‌ట‌మే మంచిద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. అందుకే.. వైసీపీ స‌ర్కారు ఏ నిర్ణ‌యం తీసుకున్నా కామెంట్ చేయ‌కుండా చూస్తూ ఉండిపోతున్నార‌ట‌.

You might also like

Leave A Reply

Your email address will not be published.