FbTelugu

సీనియర్లను కాంగ్రెస్ వదిలేస్తున్నది: కపిల్

శ్రీనగర్: రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న సీనియర్ నాయకులను కాంగ్రెస్ అధినాయకత్వం వదిలేస్తున్నదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్ వ్యాఖ్యానించారు.

ఇంత అనుభవం ఉన్న నాయకుల సేవలను ఎందుకు ఉపయోగించుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. విమానంలో ప్రయాణించే సందర్భంలో పైలట్ ఎంత అవసరమో ఇంజనీర్ కూడా అంతే అవసరమని ఆయన అన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు గులాం నబీ ఆజాద్ కాశ్మీర్ లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జీ 23 నేతలందరూ హాజరయ్యారు. ఈ సందర్బంగా కపిల్ సిబాల్ మాట్లాడుతూ, దేశంలో క్రమంగా కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతోందని, పార్టీని పటిష్టం చేయకపోతే మరింత నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ బలహీన పడుతోందన్న సత్యాన్ని గ్రహించాలని, అందుకోసమే తాము ఇక్కడ కలిశామని కపిల్ సిబాల్ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అందరినీ, అన్నీ వర్గాలను గౌరవిస్తుందని మాజీ రాజ్యసభ సభ్యుడు గులం నబీ ఆజాద్ అన్నారు. ఈ రాష్ట్రంలో ఎవరినైనా తాము గౌరవిస్తామని, అన్నీ జాతులు సమానమేనని ఆయన స్పష్టం చేశారు. మేమంతా జీ 23 నేతలని ప్రజలు అనుకుంటున్నారని, నా వరకైతే మేము గాంధీ 23 అనుకుంటున్నామని యూపీ నాయకుడు రాజ్ బబ్బర్ అన్నారు. తామంతా కాంగ్రెస్ ను ముందుకు తీసుకువెళ్లడానికి కంకణబద్దులమై ఉన్నామన్నారు. చాలా కష్టమపడి మేను ఈ స్థాయికి వచ్చామని, దొడ్డి దారిన రాలేదని, బాజాప్తాగా వచ్చామని ఆనంద్ శర్మ తెలిపారు. మేము కాంగ్రెస్ మనుషులమే, కాదనే హక్కుల ఎవరికీ లేదన్నారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్ బలహీనపడుతోంది, పటిష్టం చేయడానికే మేము మాట్లాడుతున్నామని ఆయన అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.