FbTelugu

మోసగాళ్ల తో జాగ్రత్త… ఈటలకు డిఎస్ సూచన

హైదరాబాద్: టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నాయకుడు డి.శ్రీనివాస్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా మోసగాళ్లు, నటించేవారిని గమనించాలని డిఎస్ సూచించారు
ఈటల రాజేందర్ కు డిఎస్ నైతిక మద్దతు తెలిపారు. బర్తరఫ్ కు గురైన ఈటల బుధవారం నాడు రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తో గంటకు పైగా భేటీ అయ్యారు. టిఆర్ఎస్ పార్టీకి చెందిన టివి ఛానళ్లు, పత్రికల్లో భూ కబ్జాల కథనాలు రావడం, దానిపై సిఎం కెసిఆర్ స్పందించి వెంటవెంటనే చర్యలు తీసుకున్నారన్నారు. రెండు మూడు రోజుల్లోనే బర్తరఫ్ చేయడం మూలంగా నీ ఇమేజ్ బాగా పెరిగిందని డిఎస్ ఈటలతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి దాకా ఈ స్థాయి సానుభూతి ఏ నాయకుడికి రాలేదన్నారు. పెరిగిన పలుకుబడి, సానుభూతిని నిలుపుకుంటూ కొనసాగాలన్నారు.

అయితే ఈ సమయంలో చాలా మంది నీ వద్దకు కలుస్తూ పోతుంటారు. వారిలో కొందరు నిజంగానే నీకు అనుకూలంగా ఉంటారు. క్షేత్రస్థాయిలో నీకోసం పనిచేస్తారు. మరికొందరు అనుకూలంగా ఉన్నట్లు నటిస్తారు. ఇంకొందరు వచ్చి రెచ్చగొడతారు. నటించేవారి పట్ల, రెచ్చగొట్టేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏమాత్రం గమనించకపోయినా ప్రజల్లో పలుచన అవుతావని, ఇలాంటి వారిని టిఆర్ఎస్ నీమీదికి పంపిస్తునందని డిఎస్ ఈటలతో అన్నారు. ఈటల రాజేందర్ పై సిఎం కెసిఆర్ చేస్తున్న దాడి నీచమైందని, ప్రభుత్వ అధికారులు కూడా విచ్చలవిడిగా పనిచేస్తున్నారని డిఎస్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డితో ఈటల రాజేందర్ ఫోన్ చేసి మాట్లాడారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.