FbTelugu

 ఆత్మహత్య చేసుకున్న సీనియర్ ఐఏఎస్

బెంగళూర్: ఐఎంఏ పోంజి కుంభకోణం కేసులో నిందితుడు, సీనియర్ ఐఏఎస్ అధికారి బీఎం.విజయ్ శంకర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
మంగళవారం రాత్రి బెంగళూర్ జయనగర్ లోని తన నివాసంలో విజయ్ శంకర్ ఉరేసుకుని బలవన్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. సస్సెన్షన్ ఎత్తివేసిన ప్రభుత్వం ఇటీవలే ఆయనను సకల స్కీమ్ కమిషనర్ గా నియమించింది. కర్నాటకలో కుదిపేసిన రూ.4వేల కోట్ల ఐఎంఏ (ఐ మానిటరీ అడ్వైస్) పోంజి కుంభకోణంలో విజయ్ శంకర్ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ.15 కోట్లకు పైగా లంచం తీసుకున్నారని అంటున్నారు.

ఈ కుంభకోణంపై యడ్యూరప్ప ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించగా, శంకర్ తో పాటు మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు అజయ్ హిల్లోరి, హేమంత్ నింబాల్కర్ లను విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరింది. ఈ కుంభకోణాకి ప్రధాన సూత్రదారులైన మహ్మద్ మన్సూర్ ఖాన్ గతేడాది జూలైలో దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న కర్నాటక పోలీసులు ఆయనను అరెస్టు చేసి తీసుకువచ్చారు. ఆయన పాటు మరో ఏడుగురు డైరెక్టర్లు, ఒక కార్పొరేటర్ ను అదుపులోకి తీసుకున్నారు.

పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని ఆశ చూపి మహ్మద్ మన్సూర్ ఖాన్ 2013లో ఐఎంఏ పింజి బంగారం స్కీమ్ ప్రారంభించాడు. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది నుంచి సుమారు రూ.4వేల కోట్ల వరకు సమీకరించాడు. ఫిర్యాదులు రావడంతో ఆదాయపు పన్ను శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు రంగంలోకి దిగాయి విచారణలో పోంజి కుంభకోణం బయటపడింది. నివేదిక తయారు చేసి సమర్పించాలని కర్నాటక ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి విజయ్ శంకర్ ను ఆదేశించింది. ఈ క్రమంలోనే కేసును తప్పుదారి పట్టించేందుకు విజయ్ డబ్బులు తీసుకున్నారనే ఆధారాలు ప్రభుత్వానికి లభించాయి.

You might also like