FbTelugu

హమ్మయ్య… చంద్రుడి ఫొటోలు పంపిస్తోంది!

ఢిల్లీ: చంద్రుడి ఉపరితలంపై దిగుతూ విక్రమ్ ల్యాండర్ ముక్కలు ముక్కలు కాగా ఆర్బిటార్ మాత్రం చంద్రుడు కక్ష్య చుట్టూ తిరుగుతూ ఫొటోలు పంపిస్తున్నది.
గతేడాది జూలై 22న చంద్రయాన్-2 ప్రయోగించారు. చంద్రుడు దక్షిణ ధృవంలోకి దిగే క్రమంలో గమ్యస్థానికి 2.5 కి.మీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్ క్రాష్ అయ్యింది. దీంతో అప్పటి నుంచి సంబంధాలు తెగిపోయాయి. ఆర్బిటార్ మాత్రం కక్ష్య చుట్టూ తిరుగుతూ తాజాగా ఫొటోలను పంపించింది. ఒ బిలం (క్రేటర్) ఫొటోను పంపించింది.

ఈ బిలానికి అంతరిక్ష ప్రయోగాల పితామహుడు విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారు. ఆగస్టు 12న విక్రమ్ సారాభాయత్ శత జయంతి ని పురస్కరించుకుని ఆయన స్మృత్యర్థం పేరును పెట్టినట్లు కేంద్ర అణుశక్తి శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

You might also like