FbTelugu

పోలీసులపై సెల్ఫీ వీడియో… ఆపై ఆత్మహత్య!

మెదక్: అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఇప్పశంకర్ అనే యువకుడి కుటుంబాన్ని కుల పెద్దలు కుల బహిష్కారం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇప్ప శంకర్ గ్రామానికి చెందిన ముగ్గురు కుల పెద్దల పై జనవరి 6 న అల్లదుర్గం పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం అర్ధరాత్రి వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునే ముందు తన ఆవేదనను చెబుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ తరువాత దాన్ని షేర్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.