FbTelugu

ఆత్మరక్షణ… పులినే చంపేశాడు!

బెంగళూరు: మనిషి ఆత్మరక్షణ కోసం ఎంతటి క్రూర మృగంతో అయినా పోరాడతానేది ఈ ఘటనే ఉదాహారణ. భార్య, కుమార్తెను రక్షించుకునేందుకు చిరుత పులితో ఒక వ్యక్తి తలపడి దాన్నే చంపేశాడు.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హసన్‌ జిల్లా హరిసెక్రె తాలుకా బెండాక్రె ప్రాంతంలో చోటు చేసుకుంది. భార్య, కుమార్తెతో రాజ్‌గోపాల్‌ నాయక్‌ టూ వీలర పై వెళ్ల్తుండగా పులి ఒక్కసారిగా దూకింది. బలంగా దూకడంతో బైకు మీద నుంచి ముగ్గురు కిందపడిపోయారు. ఏమాత్రం సమయం ఇవ్వకుండా వెంటనే చిరుతపులి వారిపై దాడి చేసింది. భార్య, కుమార్తెను రక్షించుకునేందుకు రాజ్‌గోపాల్‌ నాయక్‌ దానితో వీరోచితంగా పోరాడాడు. ఎంతగా ఎదిరించినా అది అక్కడి నుంచి వెళ్లకుండా దాడికి దిగడంతో నాయక్ చివరికి దాన్ని హతమార్చి తమ ప్రాణాలను రక్షించుకున్నాడు. ఈ ఘటనను దారిన పోయే వారు చూసిన స్థానికులు పులి దాడిలో తీవ్రంగా గాయపడిన నాయక్, అతని భార్య, కుమార్తెను ఆస్పత్రికి తరలించారు. పులితో పోరాడిన నాయక్ ను పలువురు అభినందించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.