FbTelugu

10 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

చెన్నై: తమిళనాడులో మరో మారు ఎర్రచందనం గుట్టురట్టైంది. రూ.10 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన తూత్తుకూడి పోర్టులో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు దుండగులు తూత్తుకూడి పోర్టునుంచి అక్రమంగా సుమారు రూ.10 కోట్ల విలువైన 16 టన్నుల ఎర్రచందనాన్ని కొబ్బరికాయల కంటైనర్ లో కాయలతోపాటూ దుబాయ్ కి తరలించేందుకు యత్నిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకొని, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.