FbTelugu

రూ.70 కోట్ల హెరాయిన్ పట్టివేత

చెన్నై: అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. కిలాడి మహిళలు కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా మాదకద్రవ్యాలను ట్రాలీ బ్యాగ్ కింద దాచినప్పటికీ దొరికిపోయాయి.
జోహన్నస్ బర్గ్ నుండి చెన్నై వచ్చిన ఆఫ్రికన్ మహిళల నుండి రూ.70 కోట్ల విలువ చేసే 10 కేజీల మాదకద్రవ్యాలు (హెరాయిన్) కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సౌత్ ఆఫ్రికా నుండి వస్తున్న వీరు కస్టమ్స్ అధికారులు గుర్తు పట్టకుండా ఘాటైన స్ప్రే కొట్టారు. ఆరోగ్యంగా వున్నప్పటికి వీల్ చెయిర్ లో కూర్చొని బయటకు చెక్కేసేందుకు సిద్ధమయ్యారు. కిలాడి మహిళల వ్యవహారం పై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు వారిని అడ్డగించారు. వీల్ చెయిర్ పై ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించగా, నీరసంగా ఉందని పక్కనే ఉన్న మరో మహిళ జవాబు చెప్పింది.
ఇద్దరి పై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారుల బృందం వారిని అదుపులోకి తీసుకుని గట్టిగా ప్రశ్నించగా గుట్టు విప్పారు. ట్రాలీ బ్యాగ్ కింది బాగంలో వున్న మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకుని ఇద్దరిపై ఎన్.డి.పిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.