FbTelugu

నకిలీ బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు పట్టివేత

మేడ్చల్: డిమాండ్ ను, రోగుల ప్రాణాలను సొమ్ము చేసుకునేందుకు మెడికల్ మాఫియా ఎన్నెన్నో ఘోరాలకు పాల్పడుతున్నది. నకిలీ బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న మెడికల్ షాపు యజమానిని పోలీసులు అరెస్టు చేశారు.
సుచిత్ర సెంటర్ బ్లాక్ ఫంగస్ వ్యాధిని నయం చేసేందుకు యాంపోటెరిసిన్-బి ఇంజక్షన్లను తయారు చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. బాటిళ్లకు నకిలీ స్టిక్కర్లు వేసి విక్రయిస్తున్నాడనే పక్కసమాచారంలో సుచిత్ర సెంటర్ లో ఉన్న మెడికల్ షాపుకు వెళ్లారు. తనిఖీలు నిర్వహించగా వందల కొద్దీ యాంపోటెరిసిన్-బి ఇంజక్షన్ బాటిళ్లు లభ్యమయ్యాయి. దీని తయారీకి ఉఫయోగించే ముడి సరకును కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.