FbTelugu

100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

కృష్ణా: కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు నిర్వహించారు. నందిగామ నుండి వస్తున్న లారీని అపి తనిఖీ చేయగా రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు.

లారీ లో అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. లారీ తో పాటు రేషన్ బియ్యంను కంచికచర్ల పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

You might also like