చెన్నై: సముద్ర మార్గంలో బోటులో అక్రమంగా తరలివస్తున్న వంద కిలోల హెరాయిన్ ను పట్టుకున్నారు. శ్రీలంకకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసి, వారి నుంచి పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు.
శ్రీలంక నుంచి సముద్ర మార్గంలో ఒక బోటు చెన్నై తీరానికి వస్తున్నది. అనుమానం వచ్చిన తీర ప్రాంత అధికారులు బోటను వెంబడించి పట్టుకున్నారు. తనిఖీలు చేయగా కోట్లాది రూపాయల విలువైన 100 కిలోల హెరాయిన్ సంచులు బయటపడ్డాయి. సుమారు 20 పెట్టెల్లో సింథటిక్ డ్రగ్స్ సంచులు ఉన్నాయి. నిందితుల నుంచి సంచులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.