FbTelugu

డ్రోన్ దాడిని తిప్పికొట్టిన భద్రతా బలగాలు

జమ్మూ: జమ్మూ కాశ్మీర్ లో ఇస్లామిక్ తీవ్రవాదులు తెగబడుతున్నారు. భారత వైమానిక దళం స్థావరంపై డ్రోన్ల దాడి జరిగిన కొద్ది గంటల్లోనే మళ్లీ డ్రోన్ల దాడి పునరావృతం కావడం కలకలం రేపుతోంది.
రత్నుచక్-కలుచక్ సైనిక స్థావరం వద్ద ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి 11.45 గంటలకు ఒక డ్రోన్, సోమవారం తెల్లవారు జామున మరో డ్రోన్ సైనిక స్థావరం వైపునకు దూసుకువచ్చాయి. వాటి రాకను గమనించి గస్తీలో ఉన్న భద్రతా బలగాలు రెండు రౌండ్ల కాల్పులు జరపంతో అవి వెనక్కి వెళ్లిపోయాయి. ఈ ఘటన తరువాత వెంటనే భద్రతా బలగాలు గాలింపు ముమ్మరం చేశారు. 2002 లో రత్నుచక్-కలుచక్ స్థావరంపై ఇదే విధంగా ఉగ్రవాదులు దాడి చేయగా 31 మంది మృతి చెందారు. వీరిలో సాధారణ పౌరులు కూడా ఉన్నారు.

ప్రత్యేక పోలీసు కుటుంబంపై కాల్పులు…
దక్షిణ కాశ్మీర్ లోని అవంతిపుర ప్రాంతంలో ఉన్న హరిపరిగామ్ లో ఆదివారం రాత్రి ప్రత్యేక పోలీసు అధికారి ఫయాజ్ అహ్మద్ కుటుంబంపై జేషే మొహ్మద్ తీవ్రవాదులు కాల్పులు జరిపారు. విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఆయన తో పాటు భార్య రజా బేగం, కుమార్తె రఫియా (22) రక్త మడుగులో పడిపోయారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.