FbTelugu

సెప్టెంబర్‌20 నుంచి సచివాలయ పరీక్షలు: మంత్రి బొత్స

అమరావతి: గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి వచ్చే నెల 20 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాల భర్తీపై ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
సమావేశం అనంతరం బొత్స మాట్లాడుతూ, వారం రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తారన్నారు.

ఈ పరీక్షలకు సుమారు 10 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అత్యంత పారదర్శకంగా ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పశు సంవర్థక అసిస్టెంట్ పోస్టుల భర్తీపై దృష్టి సారించామని, అధికారుల నుంచి వివరాలు కోరినట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

You might also like