FbTelugu

సెకండ్ వేవ్… వెనక్కి తగ్గిన షర్మిల

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగ సాధన రిలే నిరాహారదీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వైఎస్.షర్మిల ప్రకటించారు.

సెకండ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాలుగా ఉద్యోగ నియామకాల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం మూలంగా యువకులు ప్రాణాలు తీసుకున్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు చలించిన ఆమె ఉద్యోగ సాధన దీక్ష చేపట్టారు. ఈ మహమ్మారి సమయంలో కార్యకర్తలు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగ సాధన దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాని, మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియచేస్తామని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.