FbTelugu

నేడు బంగ్లాతో రెండో టీ20

Second-T20-with-Bangla-today

ఢిల్లీ వేదికగా ఎంతో ఫేవరెట్ గా భరిలోకి దిగిన టీమ్‌ ఇండియాకు తొలి టీ20 మ్యచ్ లో ఘోర పరాభవమే ఎదురైంది. కాగా బంగ్లాదేశ్‌తో నేడు రెండో టీ20 జరగనుంది. కాగా తుఫాను హెచ్చరికలు ఉండటంతో మ్యచ్ సజావుగా సాగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బంగ్లా టీం లో ప్రముఖ ఆటగాళ్లు లేకపోయినా.. తొలి టెస్టులో భారత్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఈ ఏడాది సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు సిరీస్‌ కోల్పోయిన టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను డ్రాగా ముగించింది. నేటి మ్యాచ్ పైనే ఆశలు పెట్టుకున్నారు క్రికెట్ అభిమానులు.

You might also like