FbTelugu

థియేటర్లలో సెకండ్ షో బంద్

హైదరాబాద్‌: నైట్ కర్ఫ్యూ విధించడంతో తెలంగాణ లో సినిమా థియేటర్లు రాత్రి 8 గంటలకే మూతపడనున్నాయి. ఫలితంగా సెకండ్ నడిపే పరిస్థితులు లేవు.

తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ప్రకటించిన నేపథ్యంలో బుధవారం రాత్రి 8 గంటలమే మూసివేయాలని తెలంగాణ సినిమా థియేటర్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది. మంగళవారం సినిమా థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్  ఉద్ధృతి, ప్రేక్షకుల ఆరోగ్యం దృష్ట్యా థియేటర్లు, మల్టీఫ్లెక్స్ లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నుంచి మే 1వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ (రాత్రి 9గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు) విధించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.