FbTelugu

రెండో పెళ్లి చేసిన మహిళా పూజారి

ముంబయి: సాధారణంగా పురోహితులు మాత్రమే పెళ్లిళ్లు నిర్వహిస్తుంటారు. వారు చెప్పిన ముహూర్తం ప్రకారం పెళ్లిళ్లు జరుగుతుంటాయి. కాని హీరోయిన్ దియా మీర్జా మాత్రం పురోహితురాలితో తన వివాహం జరిపించుకున్నది.
అది కూడా రెండో వివాహం కావడం విశేషం. ఈ వివాహం వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ అవుతోంది. దియా మీర్జా ఇంతకు ముందు 2014 సాహిల్ సింఘాను ప్రేమించి పెళ్లి చేసుకున్నది.

ఇద్దరికి మనస్పర్థలు రావడంతో 2019 లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత దియా మీర్జా వ్యాపారవేత్త అయిన వైభవ్ రేఖిని హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నది. ఈ నెల 15న జరిగిన ఈ వివాహాన్ని పురోహితురాలు నిర్వహించడం వార్త అయ్యింది. మా వివాహం జరిపించినందుకు ధన్యవాదాలు షీలీ అట్టా అంటూ దియా మీర్జా ట్వీట్ చేసింది. జనరేషన్ ఈక్వాలిటీ అనే హాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ పై పలువురు పలు రకాలుగా స్పందిస్తూ మెచ్చుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.