* ఎన్నికలకు వాలంటీర్లను దూరంగా ఉంచండి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే పంచాయతి ఎన్నికలు జరగనుండగా.. ఎన్నికల విధివిధానాలపై ఇవాళ అధికారులతో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలంటూ సూచించారు. ఎన్నికల్లో వాలంటీర్లకు ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను స్వాగతించాలని తెలిపారు. అయితే మొదటి ప్రాధాన్యంగా ఎన్నికలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఎన్నికల భద్రతకు కేంద్ర బలగాలను కోరినట్టు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్ లో సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీ గౌతమ్ సవాంగ్, కలెక్టర్లు, ఎస్పీలు, జడ్పీసీఈవోలు హాజరైనారు. ఇవాళ ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఎస్ఈసీ సమావేశమయ్యారు. 29వ తేదీ నుంచి జిల్లాల్లో కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు నోటీసులు జారీ చేయన్నారు. పంచాయతీలకు సంబంధించి బుధవారం తొలిదశ నోటిఫికేషన్ విడుదలకానుంది. అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి.