FbTelugu

పరిషత్ ఎన్నికలపై డివిజన్ బెంచికి: ఎస్ఈసి

అమరావతి: జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ లో సవాచల్ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసి) నిర్ణయించింది.

ఈ మేరకు డివిజన్ బెంచి లో సింగిల్ జడ్జి తీర్పును ఎస్ఈసి సవాల్ చేస్తూ పిటీషన్ వేసింది. ఈ రాత్రికి డివిజన్ బెంచి విచారించే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి పోలింగ్ వరకు కనీసం నాలుగు వారాల కోడ్ అమల్లో ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ ఆదేశాలు అమలు చేయడం లేదంటూ టిడిపి కోర్టును ఆశ్రయించడం, దీనిపై హైకోర్టు పరిషత్ ఎన్నికలు నిలిపివేయాలంటూ స్టే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.