FbTelugu

ఓట్ల కౌంటింగ్ కేంద్రాలపై ఎస్ఈసీ ఆదేశాలు

విజయవాడ: పంచాయతీ ఎన్నికల చివరి దశలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్ ప్రక్రియను మొత్తం రికార్డు చేయాలని జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్లను స్పష్టం చేసింది.

సున్నిత, అత్యంత సున్నిత పంచాయతీల్లో వెబ్ క్యాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాలు తప్పనిసరి అని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జనరేటర్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అతి తక్కువ ఓట్ల తేడా ఉంటేనే రీకౌంటింగ్ జరపాలని, అది కూడా రీ కౌంటింగ్ ఒక్కసారి మాత్రమే చేయాలని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను ఎన్నికల అధికారులు అమలు చేసి తీరాలని నిర్దేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.