FbTelugu

టీడీపీ మేనిఫెస్టోపై ఎస్ఈసీ ఆగ్రహం

* టీడీపీకి ఎస్ఈసీ నోటీసులు జారీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో అతి త్వరలో పంచాయతి ఎన్నికలు జరగనుండగా.. టీడీపీ నేతలు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.

మేనిఫెస్టో ప్రకటించడం పట్ల టీడీపీ నేతలు ఫిబ్రవరి 02 లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పంచాయతి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం పట్ల ఇప్పటికే వైసీపీ నేతలు దుమ్మెత్తి పోస్తున్న విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.