FbTelugu

కేసుల భయంతో ఇళ్ళకు సీళ్లు

ముంబయి: కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ అమాంతంగా పెరుగుతుండడంతో ప్రభుత్వం ప్రత్యక్ష కార్యాచరణకు దిగింది. పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న ఇళ్లకు బీఎంసీ అధికారులు సీళ్లు వేస్తున్నారు.

శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 6వేలకు పైగా కేసులు నమోదు కాగా ముంబైలోనే 2749 కేసులు వెలుగులోకి వచ్చాయి. గత వారం రోజులుగా కేసులు ఎక్కువ సంఖ్యలో రావడం కలవరానికి గురి చేస్తున్నది. వైరస్ సంక్రమించిన వారు నివాసం ఉండే భవనాలను బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు మూసివేశారు. మొత్తం మూసివేసిన 1305 భవనాల్లో 71,838 మంది నివాసం ఉంటున్నారు. ఇప్పటి వరకు ముంబయిలోనే 3,17,310 కేసులు నమోదు కాగా 11,435 మంది మరణించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.