FbTelugu

వైద్యానికి వెళ్తున్న చిన్నారి, డ్రైవర్ మృతి

అనంతపురం: జాతీయ రహదారి పెనుబోలు గ్రామ సమీపాన మంగళవారం స్కార్పియో వాహనం బోల్తా పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బోరుబండ గ్రామానికి చెందిన జయ, జాన తమ 27 రోజుల చిన్నారి గుండె ఆపరేషన్ చేయించుకునేందుకు స్కార్పియోలో హైదరాబాద్‌ నుంచి బెంగుళూరుకు ప్రయాణమయ్యారు.

ఇవాళ పెనుబోలు సమీపాన మలుపు వద్ద వాహనం అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొట్టింది. వాహనం బొల్తాపడడంతో రంగారెడ్డి జిల్లా సూర్యారం గ్రామానికి చెందిన డ్రైవర్‌ వడియాల శ్రీనివాస్‌ (33) అక్కడికక్కడే మృతిచెందాడు. చిన్నారితోపాటు చిన్నాన్న శ్రీనివాసులు, తల్లిదండ్రులు జయ, జాన గాయపడ్డారు. వెంటనే గాయపడిన ముగ్గురిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో చిన్నారి మృతిచెందింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.