FbTelugu

ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభం: ఏపీ సీఎం

తాడేపల్లి: ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు ఆగస్టు 3న పునఃప్రారంభించాలని సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.

జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాల్సి ఉందన్నారు. మొత్తం 9 రకాల సదుపాయాలను కల్పించాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించి రూ.456 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ కూడా విడుదల చేయడం జరిగిందన్నారు.

జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి కావాలంటే జిల్లా కలెక్టర్లు ప్రతిరోజూ సమీక్షించి, నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ పనుల కోసం అవసరమైన సిమెంటు, ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం జగన్ సూచించారు.

You might also like