FbTelugu

ఆకట్టుకునేలా స్కూళ్లు ఉండాలి: జగన్

అమరావతి: విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రభుత్వ స్కూళ్లు ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నాడు-నేడు కార్యక్రమంపై ఇవాళ ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాడు నేడు లో చేపట్టిన పనులన్నీ పూర్తి కావాలని అధికారులకు సూచించారు.

విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రతి స్కూళ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సెప్టెంబర్ 05 నే స్కూళ్లను ప్రారంభించాలని సూచించారు. అనంతరం ‘జగనన్న విద్యాకానుక’ కిట్ ను పరిశీలించారు. నిధుల కొరత లేకుండా చూసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

You might also like