FbTelugu

సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు: మంత్రి సురేష్

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ లో సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు ప్రారంభించే యోచన లో ఉన్నామని విద్యా శాఖ మంత్రి అదిమూలపు సురేష్ తెలిపారు.

అక్టోబర్ 15 నుంచి ఉన్నత విద్యాసంస్థలు ప్రారంభించే యోచన ఉందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన ఆన్ లాక్ 3 నిబంధనలు ఈనెల 31 వరకు ఉన్నాయి. పరిస్థితిని సమీక్షించిన తరువాత స్కూళ్ల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నాడు-నేడు, జగనన్న విద్యా కానుక పంపిణీ నిర్వహించిన తర్వాతే స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సురేష్ వెల్లడించారు.

You might also like