FbTelugu

తమిళనాడులో 7 నుంచి పాఠశాలల మూసివేత

చెన్నై: కరోనా కేసుల ఉధృతి అధికంగా ఉండడంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. చిన్నారులకు కూడా సోకుతుండడంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి.

తమిళనాడులో ఇప్పటికే పాఠశాలలను మూసివేశారు. 9, 10, 11 తరగతుల విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే క్లాసులు జరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్నందున ఈ నెల 7వ తేదీ నుంచి పాఠశాలలను పూర్తిగా మూసివేయాలని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపించింది. ఈ నెల ఆరో తేదీన అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగియనున్నందున, ఆ మరుసటి రోజు నుంచే పాఠశాలలు మూసివేస్తారని అంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైద్య శాఖ, విద్యాశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపే ఈ ప్రతిపాదనల్ని సిద్ధం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.