FbTelugu

ఇద్దరు ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ కేసులు

ఎమ్మెల్యేలతో పాటు పోలీసులపై కూడా

హైదరాబాద్: రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు నమోదు కావడం సంచలనం సృష్టిస్తోంది. ఒకరు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాగా, మరొకరు అధికార పార్టీకి మద్దతిస్తున్న పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నారు.

ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై  ఇవాళ ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు అయింది. ఎమ్మెల్యేతో పాటు ఇబ్రహీంపట్నం ఏసీపీ, సీఐలపై కూడా కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మలక్ పేట ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల పై ఛాదర్ ఘాట్ పీఎస్ లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.

ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై యలాల ఎంపీపీ సుకన్య ఫిర్యాదు చేయగా పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి కేసులు నమోదు చేశారు. అలాగే  బీజేపీ జాతీయ దళిత మోర్చా నాయకురాలు బంగారు జ్యోతిని దూషించిన నేపథ్యంలో బలాలపై కేసు పెట్టారు.

You might also like