FbTelugu

మాజీ మంత్రులపై ఎస్సీ, ఎస్టీ కేసు

తూ.గో జిల్లా: మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పతో పాటుగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ దంపతులపై ఎస్సీ, ఎస్టీ, వేధింపుల కేసు నమోదు అయ్యింది.

తన భర్తకు రెండోవ వివాహం చేసేందుకు ప్రయత్నించడంతో పాటుగా.. కొందరు తనను బెదిరించారని దళిత యువతి మంజు ప్రియ జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం కు ఫిర్యాదు చేశారు. మంజు ప్రియ ఫిర్యాదుతో తుని నియోజకవర్గం తొండంగి పొలీసు స్టేషన్ లో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ కుమారుడు రాధాకృష్ణ ను 2011 లో మంజుప్రియ ప్రేమ వివాహం చేసుకున్నది. రెండు రోజుల క్రిందట మాజీ మంత్రి యనమల స్వగ్రామం లో రాధాకృష్ణ కు రెండోవ వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. పెళ్ళి పెద్దలుగా మాజీ మంత్రులు యనమల, చినరాజప్ప వివాహనికి హజరయ్యారు. బాధితురాలు మంజుప్రియ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వివాహన్ని అడ్డుకున్నారు. ఎప్ఐఆర్ లో నమోదు అయిన వారి పేర్లు ఇలా ఉన్నాయి.

  1. పిల్లి రాధకృష్ణ- భర్త
  2. 2. పిల్లి సత్యనారాయణ – మావయ్య
  3. పిల్లి అనంతలక్ష్మీ – అత్త, మాజీ ఎమ్మెల్యే, కాకినాడ రూరల్
  4. యనమల కృష్ణుడు- అధ్యక్షుడు, టిడిపి, తుని నియోజకవర్గం.
  5. యనమల రామకృష్ణుడు- మాజీ ఆర్దిక మంత్రి
  6. నిమ్మకాయల చినరాజప్పల- మాజీ హోం మంత్రి.
  7. సరిదే హరి-మాజీ ఎంపిటీసి, ఇంద్రపాలెం,కాకినాడ రూరల్.
You might also like

Leave A Reply

Your email address will not be published.