FbTelugu

ఖాతాదారులకు ఎస్బీఐ వార్నింగ్

హైదరాబాద్: ఫ్రీ కోవిడ్-19 పేరుతో వచ్చే ఏ మెయిల్స్ ను కూడా ఓపెన్ చేయవద్దని ఎస్బీఐ తన ఖాతాదారులను హెచ్చరించింది. పొరపాటును క్లిక్ చేస్తే మీ ఖాతా సైబర్ దాడికి గురవుతుందని స్పష్టం చేసింది.

ఈ నెల 21వ తేదీ నుంచి సైబర్ దాడులు జరగబోతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నది. జూన్ 21 నుండి సైబర్ నేరస్థులు ఫిషింగ్ అటాక్ క్యాంపెయిన్ నిర్వహించవచ్చని CERT-In నుండి నివేదిక వచ్చిందని ఎస్బీఐ ట్వీట్ చేసింది. అనుమానిత ఈ మెయిల్ ఐడి ncov2019@gov.in పేరుతో వస్తుందని తెలిపింది.

కోవిడ్ 19 టెస్టింగ్’ సబ్జెక్ట్ లైన్‌తో పాటు ncov2019@gov.in మెయిల్ ఐడితో ఈమెయిల్ పంపే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మెయిల్ ద్వారా అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై వినియోగదారులకు ఎస్బీఐ ప్రత్యేకంగా హెచ్చరిక జారీ చేసింది.

You might also like