FbTelugu

కరోనా బాధితులకు ఎస్.బి.ఐ పర్సనల్ లోన్

ముంబయి: దేశం కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతోంది. అన్ని రంగాలు కుదేలయ్యాయి. కరోనా చికిత్సలకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

వైద్యానికి లక్షలు ఖర్చు చేసి చితికిపోయిన వారికి వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని ఎస్.బి.ఐ యాజమాన్యం నిర్ణయించింది. ఎటువంటి వ్యక్తిగత పూచికత్తు లేకుండా రుణం ఇవ్వనున్నారు. వార్షిక వడ్డీ 8.5 శాతం రేటుతో రూ.5 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. అప్పు గరిష్ట చెల్లింపు కాలం ఐదు సంవత్సరాలు కాగా డబ్బులు తీసుకున్న తరువాత మూడు నెలల పాటు ఇన్ స్టాల్ మెంట్లు చెల్లింపు మినహాయింపు కూడా ఇచ్చారు. క్లిష్ట సమయంలో ఖాతాదారుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు దీనిని ప్రవేశపెట్టినట్లు ఎస్.బి.ఐ ఛైర్మన్ దినేష్ ఖారా వెల్లడించారు. ప్రాసెసింగ్ ఫీజు కూడా రద్దు చేయడం రుణం తీసుకునేవారి ఊరటనిచ్చే అంశం.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.