FbTelugu

ఎస్.బీ.ఐ ఆఫీసర్ ను బలితీసుకున్న కరోనా భయం

హైదరాబాద్: కరోనా వైరస్ భయంతో ఒక బ్యాంకు ఆఫీసర్ బలవన్మరణం చెందారు. ఆమె ఆత్మహత్య చుట్టు పక్కల వారిని, సహచర ఉద్యోగులను తీవ్రంగా కలచివేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ కు చెందిన రుబ్బ వాణి కరీంనగర్ మంకమ్మ తోటలోని ఎస్.బీ.ఐ లో ప్రొబెషనరీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. టీఆర్ఎస్ నాయకుడికి చెందిన ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. గత నెలలో తండ్రి కరోనా పాజిటివ్ సోకి చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆ తరువాత తల్లికి కూడా పాజిటివ్ రావడంతో వాణి ఆందోళన చెందింది. తనకు కూడా కరోనా వస్తుందనే భయంతో మానసిక వేదనకు గురైన వాణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. కరోనా వైరస్ భయం, తండ్రి మృతితో తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సుసైడ్ నట్ లో పేర్కొన్నది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.