FbTelugu

కారులోనే ఎస్బీఐ ఉద్యోగి సజీవదహనం

కర్నూలు: కారు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి కారులోనే సజీవదహనమై, మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన జిల్లాలోని నంద్యాల మండలం, చాపిరేపుల టోల్ ప్లాజా దగ్గర చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బాపిరేపుల టోల్ ప్లాజా దగ్గర కొరియర్ గూడ్స్ తో వెళుతున్న ఓ లారీని కారు వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. కారులో చిక్కుకున్న ఎస్బీఐ ఉద్యోగి శివకుమార్ సజీవదహనం అయ్యాడు. మరోకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి.

You might also like