FbTelugu

రాముల‌మ్మ రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పిన‌ట్టేనా!

Say-goodbye-to-Ramullamma-politics-

లేడీ సూపర్‌స్టార్ విజ‌య‌శాంతి.. ప‌దిహేనేళ్ల త‌రువాత మ‌ళ్లీ ముఖానికి రంగు వేసుకున్నారు. అదీ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు న‌టిస్తున్న స‌రిలేరు నీకెవ్వ‌రులో ప్ర‌త్యేకంగా క‌నిపించ‌బోతున్నారు. ఏడో ఏట‌నే సినీ రంగంలో కాలుపెట్టిన ఆమె ఎన్నో విజ‌యాలు, ప‌రాజ‌యాలు చ‌విచూశారు. వ్య‌క్తిగ‌త జీవితంలోనూ అనుకున్నంత సంతోషాన్ని ఆస్వాదించ‌లేక‌పోయానంటూ ప‌లుమార్లు చెబుతుండేవారు. 1990 ద‌శ‌కంలో హీరోల‌తో స‌మానంతో రెమ్యునురేష‌న్ తీసుకున్నారు. క‌థానాయిక‌ల్లో కోటిరూపాయ‌లు పారితోష‌కం తీసుకున్న లేడి అమితాబ్ అనే గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోయిన్ వేషాలు త‌గ్గాక‌.. లేడి ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పించారు. 1999 స‌మ‌యంలో బీజేపీ ద్వారా ఆమె రాజ‌కీయ ప్ర‌వేశం చేశారు. 2008లో త‌ల్లి తెలంగాణ పార్టీ స్థాపించారు.

తెలంగాణ ఉద్య‌మం తారాస్థాయికి చేరిన త‌రువాత‌.. పార్టీను టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. కేసీఆర్‌కు చెల్లిగా రాముల‌మ్మ బాగానే గుర్తింపు సాధించారు. ఊరూవాడా తిరుగుతూ తాను కూడా నాయ‌కురాలినే అనేంత‌గా జ‌నానికి చేరువ‌య్యారు. ప్ర‌తిఘ‌ట‌న‌, ఓసేయ్ రాముల‌మ్మ , క‌ర్త‌వ్యం వంటి సినిమాల‌తో తెచ్చుకున్న ఇమేజ్‌ను రాజ‌కీయంగా స‌ద్వినియోగం చేసుకోవ‌టం అనుకున్నంత ప్ర‌జ‌ల‌కు చేరువ‌ కాలేక‌పోయారు. కేసీఆర్ అండ్ కోట‌రీతో విసిగిపోయిన ఆమె క్ర‌మంగా ఆ పార్టీకు దూర‌మ‌య్యారు. కాంగ్రెస్‌తో మ‌ళ్లీ జ‌త‌క‌ట్టారు. 2018, 2019 ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో హ‌స్తం త‌రుపున ప్ర‌చారం చేసినా సానుకూల ఫ‌లితాలు సాధించ‌లేక‌పోయారు. దీంతో రాజ‌కీయాల‌కు దూరంగా జ‌రుగుతూ వ‌చ్చారు. కొద్ది నెల‌ల క్రితం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన స‌రిలేరునీకెవ్వ‌రులో ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌తో విజ‌య‌శాంతి మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందు మెరువ‌బోతున్నారు. వ‌రుస ఘ‌ట‌న‌ల‌తో.. విజ‌య‌శాంతిలో కూడా రాజ‌కీయాల‌ను వ‌దిలేసి సినిమాకే ప‌రిమితం కావాల‌నే ఆలోచ‌న ఉంద‌నేది ఆమె అభిమానుల స్పంద‌న.

You might also like