FbTelugu

ఎన్ఆర్ఏ తో యువతకు డబ్బు, సమయం ఆదా: మోదీ

ఢిల్లీ: నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీతో దేశంలోని నిరుద్యోగ యువత కు డబ్బుల ఆదాతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉమ్మడి అర్హతా పరీక్షతో లెక్కకు మించి పరీక్షలు రాయడం ఉండదని ఆయన తెలిపారు.

ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఒకే ఆన్ లైన్ పరీక్ష (సీఈటీ) నిర్వహించేందుకు ఎన్ఆర్ఏ ఏర్పాటు చేశారు. బుధవారం నాడు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంతో ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు.

You might also like