అమరావతి: రివర్స్ టెండరింగ్ తో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.
రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటివరకు రూ.2,072.29 కోట్లు ఆదా చేశామని తెలిపారు. ఇరిగేషన్ లో రూ.1,139.18 కోట్లు ఆదా చేసినట్టు తెలిపారు. పంచాయతీరాజ్ లో రూ.196.99 కోట్లు ఆదా చేశామన్నారు.