FbTelugu

సేవ్ అమెరికా ర్యాలీ… ట్రంప్ నాయకత్వం!

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారం పది రోజుల నుంచి మళ్లీ రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. జూలై 4న అమెరికాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు.
జూలై 4వ తేదీకి ఒకరోజు ముందు అనగా మూడో తేదీన సేవ్ అమెరికా పేరుతో భారీ ర్యాలీ నిర్వహించి జనంలో బలం నిరూపించుకునేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు.

మూడో తేదీ రాత్రి 8గంటల నుంచి అర్థరాత్రి వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీని తన సొంత రాష్ట్రం ఫ్లోరిడాలో ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ ఆఫ్ ప్లోరిడా ఈ కార్యక్రమాన్ని సేవ్ అమెరికా పేరుతో నిర్వహిస్తుండడం విశేషం. కరోనా వైరస్ మూలాలు చైనాలో ఉన్నాయని ట్రంప్ రెండేళ్ల నుంచి వాదిస్తున్నాడు. చైనా దేశంలో విచారణ జరిపితే తప్ప కరోనా మూలాలు వెలుగులోకి రావని చెబుతున్నా మొన్నటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన నూతన అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ కరోనా గుట్టు రట్టు చేయాలని ఎఫ్.బి.ఐ ని ఆదేశించారు. ఈ ప్రక్రియ రెండు వారాల్లో పూర్తి చేయాలని ఇటీవలే ఆదేశించిన విషయం తెలిసిందే. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిజమవుతున్న తరుణంలో ఇటీవలి కాలంలో ఆయనకు అమెరికాలో బాగా మద్దతు పెరుగుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.