FbTelugu

ఫ్లాస్మా థెరఫీతో మంత్రి ఆరోగ్యం మెరుగు

ఢిల్లీ: ఫ్లాస్మా థెరఫీ తో ఢిల్లీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం మెరుగుపడింది. ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు సోమవారం తరలించనున్నారు.

కరోనా వైరస్ సోకిన జైన్ తొలుత రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చేరారు. మెరుగు పడకపోగా మరింతగా విషమించంతో కుటుంబ సభ్యులు ఆయనను మాక్స్ హాస్పిటల్ కు తరలించారు. ఐసీయులో ఆయనకు చికిత్స అందించడంతో పాటు ఫ్లాస్మా థెరఫీ ఇవ్వడంతో మెరుగుపడింది. మంత్రి ఆరోగ్యం నిలకడగా ఉంది, త్వరలోనే కోలుకుంటారని ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతీ ట్వీట్ చేశారు.

You might also like