FbTelugu

రాజకీయాలకు నెచ్చెలి శశికళ గుడ్ బై

తన పాచిక పారకపోవడంతోనేనా?

చెన్నై: మాజీ ముఖ్యమంత్రి కుమారి జె.జయలలిత హయాంలో ఒక వెలుగు వెలిగి నాలుగేళ్లు జైలు జీవితం అనుభవించిన నెచ్చెలి వికె.శశికళా నటరాజన్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు.

రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెబుతున్నట్లు ఆమె ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు శశికళా నటరాజన్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. త్వరలో జరిగే ఎన్నికల్లో డీఎంకే ను ఓడించాలని ఎఐఏడీఎంకే కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. జయలలిత బంగారు పాలనతో తమిళనాడు లో కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. జయలలిత మరణం తరువాత తమిళనాడు సీఎం పీఠంపై కూర్చోవాలని కుయుక్తులు పన్నింది. ప్రభుత్వాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్ని ఎన్నో కుట్రలకు తెరలేపడంతో, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనీ స్వామి ఆమెకు చెక్ పెట్టారు. పాత కేసులు తవ్వితీయడంతో ఆమెకు మద్రాస్ హైకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పు ప్రకారం శశికళను కర్నాటక రాష్ట్రం బెంగళూరు లోని పరప్పన ఆగ్రహార జైలుకు తరలించారు. జైలు జీవితం గడిపిన ఆమె గత నెలలో విడుదలై అట్టహాసంగా రాష్ట్రంలో ప్రవేశించారు. ఎఐఏడిఎంకే పార్టీ తనదేనంటూ సుప్రీంకోర్టులో కేసులు కూడా వేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.

ఎఐఏడీఎంకే నాయకుడు, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనీ స్వామి ఆమె విషయంలో చాలా ధృడంగా వ్యవహరించారు. పార్టీ కార్యాలయంలోకి ఆమె రాకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. పార్టీ పని చేసే కార్యకర్తలది అనే విధంగా ఆయన వ్యవహరించారు. దీంతో తన పప్పులు ఉడకవని భావించిన ఆమె రాజకీయాలను శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.