FbTelugu

అప్పుల బాధతో ఉరేసుకున్న సర్పంచ్

కరీంనగర్: అప్పుల బాధ, చేసిన పనులకు నిధులు రాకపోవడంతో వేదనకు గురైన ఒక సర్పంచ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఇల్లంతకుంట మండలం సోమారంపేట గ్రామంలో జరిగింది.

గ్రామస్థులు కథనం ప్రకారం ఇల్లంతకుంట మండలం సోమారంపేట సర్పంచ్ ఆత్మహత్య సోమరంపెట గ్రామ సర్పంచ్ గా వడ్డే ఆనంద్ రెడ్డి ఉన్నారు. గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడం లేదని కొద్ది రోజులుగా సన్నిహితుల ముందు వాపోయాడు. ఒత్తిడి తట్టుకోలేక అప్పుల బాధ తాళలేక ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకొని మరణించారు. బుధవారం తన వ్యవసాయబావి వద్ద ఆత్మ హత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.