FbTelugu

మొదలైన సర్పంచుల పాలన

అమరావతి: ఏపీలో గ్రామ పంచాయతీల్లో ఇవాళ్టి నుంచి సర్పంచుల పాలన మొదలైంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు రాష్ట్రమంతటా నేడు పదవీ ప్రమాణ స్వీకారం చేసి, అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

దాదాపు రెండున్నర ఏళ్లుగా ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు కొనసాగుతున్నాయి. 2018 ఆగస్టు 1వ తేదీ నాటికే అప్పటి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసినప్పటికీ, కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా ప్రత్యేకాధికారుల పాలనకు ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు కేసుల నుంచి విముక్తి లభించడంతో కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.