FbTelugu

సర్పంచ్ పదవికి వేలం.. రూ.52 లక్షలు!

కాకినాడ: జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో సర్పంచ్ పదవికి వేలం పాట నిర్వహించారు. సర్పంచ్ పదవిని ఓ వ్యక్తి రూ.52 లక్షలకు పాడుకున్నారు.

అయితే ఎన్నికల్లో పోటీ చేయాలని గ్రామపెద్దలు సదరు వ్యక్తికి తెలిపారు. పాట పాడుకున్న వ్యక్తికి గ్రామస్తులు మద్దతిచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఒకవేళ ఓడిపోతే డబ్బులు ఇవ్వక్కర లేకుండా.. గెలిస్తే రూ.52 లక్షలు ఇచ్చేలా ఒప్పందం ఖరారైంది. రాష్ట్రంలో అత్యధిక మొత్తంలో చెల్లిస్తున్న వ్యక్తిగా రికార్డుకెక్కారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.