FbTelugu

టీడీపీ ఎంపీ కి సర్కార్ షాక్

అమరావతి: టీడీపి ఎంపీ గల్లా జయదేవ్‌కు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. అమర్ రాజా ఇన్‌ఫ్రా టెక్ లిమిటెడ్‌కు కేటాయించిన 253 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీఐఐసీ కింద గత ప్రభుత్వం అమర్ రాజా ఇన్‌ఫ్రాకు 253 ఎకరాలు కేటాయించింది. ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు లేకపోవడంతో వెనక్కి తీసుకుంటున్నామని ప్రభుత్వం పేర్కొన్నది. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళెం నునిగుండ్లపల్లి, కొత్తపల్లిలోని సర్వే నెంబర్  65/1 భూములు వెనక్కి తీసుకుంటూ జీఓ జారీ అయ్యింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.